»Bjp Leaders Hold Key Positions Which Departments Are Better Than Whom
Central Ministers: కీలక పదవులు బీజేపీ నాయకులకే.. ఏ శాఖలు ఎవరికంటే?
ప్రధాన మంత్రిగా జూన్ 9న మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. బీజేపీ నాయకులకే కీలక శాఖలు కేటాయించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన శాఖ కేటాయించారు. మరోవైపు మోడీ మెచ్చిన మరో యువనేత చిరాగ్ పాశ్వాన్‌కు క్రీడాశాఖను కేటాయించారు.
BJP leaders hold key positions.. Which departments are better than whom?
Central Ministers: ప్రధాన మంత్రిగా జూన్ 9న మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. బీజేపీ నాయకులకే కీలక శాఖలు కేటాయించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన శాఖ కేటాయించారు. మరోవైపు మోడీ మెచ్చిన మరో యువనేత చిరాగ్ పాశ్వాన్‌కు క్రీడాశాఖను కేటాయించారు. జూన్ 9న పాటు మరో 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30 మందికి కేబినెట్ హోదా దక్కగా.. మరో ఐదుగురు స్వతంత్ర హోదాలో ఉంటారు. మరో 36 మందికి సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు మోడీ. తాజాగా వీరికి శాఖలను కేటాయించారు. అమిత్ షాకు మళ్లీ హోంశాఖనే కేటాయించారు మోడీ. నితిన్ గడ్కరీకి సైతం మళ్లీ రవాణా శాఖనే అప్పగించారు. నిర్మలా సీతారామన్‌కు ఆర్ధిక శాఖ, జై శంకర్‌కు విదేశాంగ శాఖను అప్పగించారు. రక్షణ శాఖను తిరిగి రాజ్‌నాథ్ సింగ్‌కే కేటాయించారు. మనోహర్ లాల్ ఖట్టర్-కు పట్టణ అభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం శాఖను కేటాయించారు. అశ్విని వైష్ణవ్‌కి రైల్వే, సమాచార&ప్రసార శాఖా మంత్రిగా అవకాశం కల్పించారు.
పీయూష్ గోయల్‌కి వాణిజ్య శాఖను కేటాయించగా…ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్యా శాఖ కేటాయించారు. శ్రీపాద నాయక్‌కు విద్యుత్ శాఖ కేటాయించారు. జేపీ నడ్డాను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించి కేంద్ర మంత్రిని చేసిన మోడీ… ఏకంగా కీలకమైన వైద్యశాఖను అప్పగించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయించారు. గతంలో ఈ శాఖను టీడీపీకే చెందిన ఎంపీ అశోక్‌గజపతి రాజు నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహరాల శాఖను కిరణ్ రిజుజుకు అప్పగించారు. వ్యవసాయ శాఖను శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కేటాయించారు. గజేంద్రసింగ్ షెకావత్‌కు టూరిజం శాఖను కేటాయించారు. జలశక్తి మంత్రిత్వ శాఖను సీఆర్ పాటిల్‌కు కేటాయించగా… కార్మిక శాఖను మన్సుఖ్ మాండవీయాకు అప్పగించారు. శర్బానంద సోనోవాల్‌కు కీలకమైన షిప్పింగ్ మినిస్ట్రీను అప్పగించారు. యువనాయకుడు చిరాగ్ పాశ్వాన్‌కు క్రీడాశాఖను కేటాయించారు.