»Actress Hema Posted Another Video On Social Media
Actress Hema: సోషల్ మీడియాలో మరో వీడియో పెట్టిన నటి హేమ
బెంగళూరు రేవు పార్టీలో నటీ హేమ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను అక్కడికి వెళ్లలేదు అని ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోపై కర్ణాటక పోలీసులు ఫైర్ అయ్యారు. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Actress Hema: తెలుగు పరిశ్రమలో మంచి పాత్రలు వేస్తూ గుర్తింపు తెచ్చకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే బెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ రేవ్ పార్టీ (Bengaluru Rave Party)తో హేమ పాల్గొన్నట్లు పలు ఆరోపణలు వచ్చాయి. అదే విషయం ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశం అవుతుంది. ఇదే పార్టీలో తనతో పాటు పలువురు తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ ఉన్నట్లు ప్రచారం జరిగింది. తరువాత అందులో ఉన్నది వారు కాదు అని శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో నటి హేమ సైతం ఒక వీడియోను విడుదల చేసింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. దానిపై కర్ణాటక పోలీసులు ఫైర్ అయ్యారు. ఇలా తప్పుడు వీడియోలు చేయడం పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు అవుతుంది అని అధికారులు స్పందించారు. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం నెటిజనుల దృష్టి అంతా వీరి అకౌంట్లపై పడింది. దీంతో వారు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా నటి హేమ ధమ్ బిర్యాని ఎలా తయారు చేయాలో చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో హాల్ చల్ అవుతుంది. దానిపై నెటిజనులు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వీడియోలతో కవర్ చేయకు అని రాసుకొస్తున్నారు. అంతే కాకుండా మేడమ్ మీ డైట్ చెప్పండి చాలా స్లిమ్‌గా ఉన్నారు అని మరొక నెటిజన్ కామెంట్ పెట్టారు. అలాగే సుప్పిని, సుద్దపూసని అని వేరో నెటిజన్ కామెంట్ పెట్టారు. దీనిపై నటి హేమ స్పందించలేదు. ఇప్పటికే తనపై ఆరోపణలు వచ్చాయి. అలాంటి సమయంలో తాను సైలెంట్‌గా ఉండాల్సింది పోయి ఇలాంటి వీడియోలు పెట్టడం ద్వారా ఏంటి ప్రయోజనం, తాను ఏ తప్పు చేయకపోతే చట్టాలు ఉన్నాయి కదా అని కొంత మంది హేమకు హితవు పలుకుతున్నారు.