BDK: బూర్గంపాడు మండలం, సారపాక గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ TPCC సభ్యులు ఎడమ కంటి రోషి రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రోషి రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి వారు అనేక సేవలు చేసి చెరగని ముద్ర వేశారని ఆయన తెలిపారు.