KMM: జనవరి 18, 2026న జిల్లాలో జరగనున్న సీపీఐ శత జయంతి ముగింపు సభ కోసం AISF జిల్లా కమిటీ రూ. 1.50 లక్షల విరాళాన్ని అందజేసింది. నిన్న AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల రామకృష్ణ ఈ మొత్తాన్ని సీపీఐ జాతీయ నేత భాగం హేమంతరావుకు అప్పగించారు. ఈ చారిత్రాత్మక సభను విజయవంతం చేసేందుకు రైతులు, కార్మికులు భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా హేమంతరావు పిలుపునిచ్చారు.