NZB: ఆర్టీసీ ఆర్మూర్ డిపోలో కార్గోలో పాత వస్తువులు వేలంపాట వేస్తున్నట్లు డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. వినియోగదారులు తీసుకెళ్లని వస్తువులు ఈనెల 29వ తేదీ సోమవారం బస్టాండ్ ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు పాల్గొని అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చన్నారు.