»Child In Arm Woman Stuck In Ambulance For 1 Hour On Nitish Kumar Convoy
Mother చేతిలో చిన్నారి.. రోడ్డుపై ఆపిన అంబులెన్స్, ఎందుకంటే..?
బీహర్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్ వల్ల ఓ అంబులెన్స్ గంట పాటు ఆగింది. అందులో ఓ చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తమకు దారి ఇవ్వాలని ఆ చిన్నారి తల్లి వేడుకున్న పోలీసుల మనసు కరగలేదు.
Child In Arm, Woman Stuck In Ambulance For 1 Hour On Nitish Kumar Convoy
Woman Stuck In Ambulance: సీఎం కోసం ట్రాఫిక్ ఆపుతారు. కొన్ని సందర్భాల్లో పేషంట్లు ఉంటారు. వారి పరిస్థితి దృష్ట్యా అనుమతించాలి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ఆర్ మాత్రం.. తన కోసం వాహనాలను ఆపివేయొద్దని మీడియా ముఖంగానే కోరారు. ఆ తర్వాత నేతలెవరూ అలాంటి ప్రకటన చేయ లేదు. బీహర్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) కాన్వాయ్ వల్ల ఓ తల్లి తల్లడిల్లి పోయింది.
ఏం జరిగిందంటే..?
నలందలో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభించి తిరిగి పాట్నాకు బయల్దేరారు సీఎం నితీశ్ కుమార్. ఆ దారి గుండా వాహనాలను పోలీసులు నిలిపివేశారు. సరిగ్గా ఆ సమయంలో ఫతుహ వద్దకు ఓ అంబులెన్స్ వచ్చింది. అందులో ఓ చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తన చేతిలో చిన్నారిని ఉంచుకున్న ఆ తల్లి.. తమకు దారి ఇవ్వాలని పోలీసులను వేడుకుంది. అయినప్పటికీ ఆ ఖాకీల కఠిన మనసు కరగలేదు.
గంటపాటు వెయిటింగ్
చావు బతుకుల మధ్య చిన్నారి ఉందని అక్కడ విధులు నిర్వహించే పోలీసులను కోరింది. అంబులెన్స్ డ్రైవర్ కిందకి దిగి మరి అడిగాడు. తమకు కొంచెం దారి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. సీఎం కాన్వాయ్ వెళ్లే వరకు వదలి ప్రసక్తే లేదని ఆ పోలీసులు స్వామి భక్తిని ప్రదర్శించారు. చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆ తల్లి బాధ అంతా ఇంతా కాదు. ఆ భగవంతుడి మీద భారం వేసి అలానే ఉంది.
మరో ఘటన
ఇప్పుడే కాదు గత నెలలో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. పాట్నాలో సీఎం కాన్వాయ్ వస్తోందని అంబులెన్స్ ఆపివేశారు. ఈ ఇష్యూ కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. అంబులెన్స్ ఆపిన పోలీసులను తర్వాత గుర్తించారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకేనెమో.. ఇప్పుడు కూడా ఖాకీలు అలానే ప్రవర్తించారు. అసలు మానవత్వం చూపలేదు. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది సీఎం నితీశ్ కుమార్ వ్యవహారశైలిని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు.