»Madhya Pradesh Assembly Election 2023 Congress Rahul Gandhi In Railly Attack Pm Narendra Modi And Bjp Government
Rahul Gandhi: ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే ఇద్దరి మధ్య పోరాటం
మధ్యప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి రావాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చాలా బహిరంగ సభలను నిర్వహిస్తోంది. పార్టీ సీనియర్ నాయకులు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
Rahul Gandhi: మధ్యప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి రావాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చాలా బహిరంగ సభలను నిర్వహిస్తోంది. పార్టీ సీనియర్ నాయకులు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో ర్యాలీకి చేరుకున్నారు. ఇక్కడ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపైనా, రాష్ట్రంలోని శివరాజ్ ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది సిద్ధాంతాల పోరాటం, ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే.. ఒకవైపు ద్వేషం, హింస, అహం, మరోవైపు ప్రేమ, సౌభ్రాతృత్వం.. ఈ సందర్భంగా ఆయన అన్నారు. మీడియాపై కూడా విరుచుకుపడ్డాడు. కాంగ్రెస్ వాళ్ల మీటింగ్ ను కవర్ చేయరన్నారు.
బీజేపీ, మోడీలపై విరుచుకుపడుతూ.. ‘వాళ్లు ఎక్కడికి వెళ్లినా విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని యువత, రైతులు వారిని ద్వేషించడం మొదలుపెట్టారని.. వారు ప్రజలకు ఏం చేశారో.. ఇప్పుడు ప్రజానీకం వాళ్లకు కూడా అదే చేస్తారు’ అని అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్బంగా ఇక్కడ అన్ని వర్గాల ప్రజలను కలిశామన్నారు. భారతదేశంలో మధ్యప్రదేశ్ అవినీతికి కేంద్రంగా మారిందని అందరూ అన్నారు. ఇక్కడ బిజెపి వ్యక్తులు చేసిన అవినీతి.. మొత్తం దేశంలో మరెక్కడా చేయబడలేదు. పిల్లల పాఠశాల నిధుల నుండి మహాకాల్ కారిడార్ వరకు ప్రజలు డబ్బును స్వాహా చేశారు. వ్యాపం స్కాంలో కోట్లాది మంది ప్రజలు నష్టపోయారని రాహుల్ విమర్శించారు. ప్రధాని మోడీ గౌతమ్ అదానీకి లబ్ధి చేకూర్చారని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు.