తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీనికి రాహుల్ స్పందిస్తూ.. అమిత్ షాకు కౌంటర్ వేశారు.
Rahul Gandhi: జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులను రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తొలి ప్రధాని పండింట్ జవహర్ లాల్ నెహ్రూ మీద పరోక్షంగా విమర్శలు చేశారు. ఒక వ్యక్తి చేసిన పొరపాటు వల్ల భారత్‌లో జమ్మూకశ్మీర్ భాగం కావడం లేటు అయ్యిందని పరోక్షంగా నెహ్రూ మీద విమర్శలు చేశారు. కాల్పుల విరమణ లేకపోతే ఈ రోజు పీవోకే ఉండేది కాదని అమిత్ షా అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
#WATCH | Congress MP Rahul Gandhi says "Pandit Nehru gave his life for India, he was in jail for years. Amit Shah is unaware of history. I cannot expect him to know history, he has the habit of rewriting it…" pic.twitter.com/SRVClqloIE
పండింట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశం కోసం తన జీవితాన్ని అర్పించారు. దేశ ప్రజల కోసం ఏళ్ల పాటు జైలులో ఉన్నారు. అమిత్ షాకు చరిత్ర తెలియదు. అందుకే పదే పదే దాన్ని తిరగరాస్తూనే ఉన్నారని రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేస్తుందనిఅన్నారు. కుల గణన, నిరుద్యోగం, దేశంలోని ధనమంతా ఎక్కడ, ఎవరి చేతుల్లో ఉందని అంశాలపైన చర్చించేందుకు బీజేపీ భయపడుతోందని రాహుల్ అన్నారు.