రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా చేపట్టారు.
Hyderabad: రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. తమకు వెంటనే న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సెలక్షన్ పూర్తయి రెండు నెలలు గడుచింది. దీంతో వెంటనే తమను ట్రైనింగ్ కు పంపించాలని కోరారు. తమకు ఇంతవరకు ట్రైనింగ్ పంపించకపోవడంపై విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు.
2022 ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఇచ్చి.. అనంతరం సెలక్షన్స్ పూర్తయినా, మూడు నెలలు గడుస్తున్నా కోర్టులు.. కేసుల పేరుతో తమకు అన్యాయం చేయడంపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరినీ వెంటనే ట్రైనింగ్ పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించి వెంటనే పరిష్కరించాలని లేకపోతే డీజీపీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.