ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్ నెట్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ అధినేత పేరును చేర్చుతూ సీఐడీ కేసును ఫైల్ చేసింది. అయితే చంద్రబాబు ముందుగానే ఈ కేసు విషయంలో బెయిల్‌కు అప్లై చేశారు. ఈ తరుణంలో నేడు చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జనవరి 17వ తేదికి వాయిదా వేసింది.
జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఫైబర్ నెట్ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. జనవరి 17వ తేది వరకూ ఇటు చంద్రబాబు కానీ, అటు ఏపీ ప్రభుత్వం కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని సుప్రీం కోర్టు సూచను చేసింది. నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూథ్రా తన వాదనలు వినిపించగా సుప్రీం విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు కేసులు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా సుప్రీం తీర్పు ఇవ్వాలి. ఈ కేసు తీర్పు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేకెత్తించనుంది. స్కిల్ కేసు తీర్పుపైనే బాబు రాజకీయ ప్రస్థానం ఆధారపడి ఉంటుందని, ఆ తీర్పు ఇతర కేసులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.