four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
ఏపీలోని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలు పాటించడం లేదని ఈ మేరకు వెల్లడించింది. అంతేకాదు పిటిషనర్లకు రూ.25 లక్షలు చెల్లించాలని కోర్టు గతంలో కూడా ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో యుడవలి వారి సత్రాన్ని ఆక్రమించుకున్నారని ఎటువంటి లీజు చెల్లించకుండా స్కూల్ నిర్వహిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను పాటించడం లేదని పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజుల జైలు శిక్షతోపాటు రెండు వేల రూపాయల జరిమానాను కూడా విధించింది. ఈ క్రమంలో జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.