Nara Lokesh: దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిరుద్యోగం అత్యధికంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 24 శాతానికి పెరగటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో మెండుగా ఉండే ఏపీని వైఎస్ జగన్ కూల్చేశారని విమర్శించారు. నిరుద్యోగం కారణంగా ప్రస్తుతం యువత నిరాశతో ఉందని లోకేశ్ మండిపడ్డారు. ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బాధపడ్డారు. అన్ని అర్హతలు ఉన్న ఏపీ యువత భవిత మెరుగుపడాలని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Among all the states, Andhra Pradesh has THE HIGHEST UNEMPLOYMENT RATE in the country – a staggering 24%.
YS JaGone has brought a once flourishing state to its knees, leaving the youth struggling with a sense of hopelessness and despair.
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం రాజులకొత్తూరు వద్ద ఈ మైలురాయి చేరుకున్నారు. నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి పైలాన్ ఆవిష్కరించారు. సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. ఈ నెల 18వ తేదీన యువగళం పాదయాత్ర ముగియనుంది. తర్వాత ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ హాజరువుతారు.