»Tspsc Chairman Janardhan Reddy The Governor Did Not Accept The Resignation Of Tspsc Chairman
TSPSC Chairman: రాజీనామాలో ట్విస్ట్, ఇంకా ఆమోదించని గవర్నర్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని రాజ్‌భవన్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
TSPSC Chairman Janardhan Reddy: The Governor did not accept the resignation of TSPSC Chairman
TSPSC Chairman Janardhan Reddy: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి(Janardhan Reddy) రాజీనామా ఇష్యూలో గందరగోళం నెలకొంది. రాజీనామా చేశారని.. గవర్నర్ ఆమోదించారని నిన్న వార్తలు వచ్చాయి. అయితే గవర్నర్ తమిళసై రాజీనామాను ఆమోదించలేదు. ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో బాధ్యులు ఎవరో తెలియకుండా జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గవర్నర్ తమిళసై ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు.
జనార్దన్ రెడ్డి(Janardhan Reddy) నిన్న సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి(Revanth reddy)ని కలిసిన తర్వాత టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవీకి రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జరిపే సమీక్షకు టీఎస్పీఎస్సీ చైర్మన్ హోదాలో జనార్ధన్‌రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాత పరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియ వంటి అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పేపర్ లీక్ అంశం గురించి తెలిసిందే. పేపర్ లీక్‌పై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సమగ్ర నివేదిక ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ సహా 9 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు సిట్ చీఫ్ శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.