»Hyderabad Cyberabad Rachakonda Pcs Are Transferred
Hyd సహా సైబరాబాద్, రాచకొండ సీపీల బదిలీ, కొత్త కొత్వాళ్లు వీరే
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా పనిచేసిన సందీప్‌కు తప్ప.. మిగిలిన ఇద్దరికీ పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
Hyderabad Cyberabad Rachakonda PCs Are Transferred
Police Commissioners: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో శాఖపై దృష్టిసారించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కో వింగ్‌ను ప్రక్షాళన చేస్తున్నారు. కొందరు బాస్‌లు సొంతంగా రాజీనామా చేయగా.. మరికొందరి చేత రిజైన్ చేయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్ (cyberabad), రాచకొండ (Rachakonda) పోలీస్ కమిషనర్లపై (Police Commissioners) బదిలీ వేటు వేశారు. కొత్త సీపీలను నియమించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (srinivas Reddy), సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతి (avinash), రాచకొండ సీపీగా సుధీర్ బాబును (sudheer Babu) నియమించారు. హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. రాచకొండ సీపీగా చేసిన చౌహాన్, సైబారాబాద్ సీపీగా చేసిన స్టీఫెన్ రవీంద్రకు ఇప్పటివరకు పోస్టులు కేటాయించలేదు. ఇద్దరినీ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ కూడా జరిగే అవకాశం ఉంది. తమకు అనుకూలంగా లేని అధికారులపై బదిలీ వేటు పడనుంది. గత ఎన్నికల ప్రచారంలో రేవంత్ చేసిన కామెంట్లపై చర్చ జరుగుతుంది. ఏ అధికారులు ఏ విధంగా వ్యవహరించారో గుర్తుంచుకుంటాం.. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంగతి తేలుస్తాం అన్నారు. అలా అని కాదు.. అనుకూలంగా లేని ఆఫీసర్స్‌ని మాత్రం మారుస్తున్నారు.