KA Paul: బాత్ రూమ్లో జారిపడటంతో మాజీ సీఎం కేసీఆర్ (kcr) ఎడమ తుంటి ఎముక విరిగింది. దీంతో యశోద ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్ను వరసగా నేతలు పరామర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సినీ నటుడు చిరంజీవి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆస్పత్రిలో కలిసి, మాట్లాడారు.
యశోద ఆస్పత్రికి ఈ రోజు (మంగళవారం) ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) వచ్చారు. కేసీఆర్తో కేఏ పాల్ మాట్లాడారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రెండురోజుల క్రితం కేసీఆర్ గురించి కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న అధికారులు దేశం విడిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ వెంటనే ఆస్పత్రికి వచ్చి కలిశారు. తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల పాలు కావడానికి కేసీఆర్ కారణం అని అప్పుడు ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై విచారణ జరిపించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. అప్పటివరకు దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు అంతగా లేవు. అందుకోసమే కాబోలు.. కేసీఆర్ను సీఎం సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.