»Another Good News For The People Of Telangana New Ration Cards Soon
Ration Cards: తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు!
తెలంగాణలోని పేదల ప్రజలకు సర్కార్ తీపికబురు చెప్పింది. కొత్త రేషన్ కార్డుల జారీపై నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ తరుణంలో త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయంపై నేడు కీలక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది.
తెలంగాణ (Telangana) ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే పేదలకు కొత్త రేషన్ కార్డుల (New Ration cards)ను అందించనుంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి వెంటనే అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. తాజాగా అర్హులందరికీ రేషన్ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) నేడు అధికారులతో సమావేశం అయ్యి ఈ మేరకు చర్చలు జరిపారు.
ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajiv ArogyaSri) సహా అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి. ఈ తరుణంలో కొత్త రేషన్ కార్డుల జారీపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. 2014 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. ఈ తరుణంలో లక్షలాది మంది పేదలు ఆ రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు. కొంత మంది తమ రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లు చేర్చడం లేదా కుటుంబాల నుంచి వేరుపడిన వారు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
రేషన్ కార్డుల కోసం ఇప్పటికే అనేక దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ (Hyderabad)లోనే రేషన్ కార్డుల కోసం దాదాపుగా 1.25 లక్షల దరఖాస్తులు ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కార్డులు కలిపి 90.14 లక్షల వరకూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీతో పాటు సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా వంటి స్కీమ్స్ (All Schemes)కు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో వాటి జారీకి సర్కార్ కసరత్తు ప్రారంభించింది.