TGSRTC: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఎస్ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంచి. ఈ మేరకు మంగళవారం టీజీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులలో డ్రైవర్ పోస్టులు 2000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్)- 114, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)- 84, డీఎంజ*ఏటీఎం మెకానికల్ ఇంజినీర్- 40, మెడికల్ ఆఫీసర్- 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్)- 11, అకౌంట్స్ ఆఫీసర్- 6 పోస్టులున్నాయి. ఇప్పటికే అన్ని శాఖాల్లో ఖాళీలను గుర్తించినట్లు త్వరలోనే వాటిని భర్తి చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే టీజీఎస్ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఎప్పటినుంచో కసరత్తు చేస్తున్నా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. తెలంగాణలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో కూడా దీనికి సంబంధించి నియామక ప్రక్రియ జరగలేదు. అయితే మొత్తం ఈ సంస్థంలో ఇప్పటికే 43వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అయినా సరే ఇంకా భర్తీ కావాల్సిన పోస్టులు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. దీనిపై తుది చర్చలు ముగియడంతో తాజాగా 3,035 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చారు.