»Good News For Volunteers Soon Minister Kandula Durgesh
Kandula Durgesh: వాలంటీర్లకు త్వరలో గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎలక్షన్ టైమ్లో చాలా మంది రాజీనామా చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. అసలు వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు.
Good news for volunteers soon.. Minister Kandula Durgesh
Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దీనిపై నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఎన్నికలో ప్రచారంలో కూటమి వారి పదవికి ఎలాంటి ప్రమాదం లేదని, జీతం కూడా పెంచుతామని చెప్పింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఇప్పటికీ దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దాంతో వాలంటీర్లు ఆందోళనలో ఉన్నారు. ఇక నెలవారిగా ఇచ్చే పింఛన్లను కూడా సచీవాలయ సిబ్బందికే అప్పగించారు. దీంతో వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో సినిమాటోగ్రఫి, టూరిజమ్ మినిస్టర్ కందుల దుర్గేష్ స్పందించారు. వాలంటీర్లపై త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
నిడదవోలులో ఏర్పాటు చేసిని మీడియా సమావేశంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా కూటమి సంక్షేమం అందిస్తుంది అని, ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పారు. ఇక వాలంటీర్లకు కూటమి అన్యాయం చేయబోదని మరోసారి గుర్తు చేశారు. ఇక పింఛన్లు కూడా వెయ్యి పెంచి మూడు నెలలతో కలిపి మొత్తం రూ. 7 వేలు ఇస్తుందని పేర్కొన్నారు. జులై 1న రాష్ట్రంలో 90 శాతం వరకు పింఛన్ల పంపిణీ చేయాలని గ్రామా సచీవాలయాలకు ఆదేశించినట్లు వెల్లడించారు.