ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు కొండగట్టును సందర్శించిననున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ తొలిసారిగా అధికారిక హోదాలో హనుమాన్ సన్నిధిలో ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి బయలు దేరి ఆలయానికి చేరుకోనున్నారు.
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టును సందర్శించనున్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొండగట్టుకు జూన్ 29న రానున్నారు. ఈ సందర్భంగా హానుమాన్ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పవన్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నసంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు. శనివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్, మదాపూర్లో ఉన్న ఆయన నివాసం నుంచి బయలు దేరుతారు. ఉదయం 11 గంటలకు కొండగట్టును చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 12.30 గంటలకు తిరిగి బయలుదేరుతారు. శనివారం సాయంత్రానికి మదాపూర్ చేరుకుంటారు. రాత్రి హైదరాబాద్లోనే బస చేసి ఆదివారం ఉదయం ఏపీకి వెళ్లనున్నారు.
ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో భాగంగా ఆయన 11 రోజుల పాటు కేవలం పండ్లు, పానీయాలను మాత్రమే ఆహారంగా తీసుకోంటారు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కొండగట్టుకు రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రచార రథమైన వారాహికి ఇక్కడే పూజలు నిర్వహించారు. ఏపీ ఎన్నికల్లో ఆయన విజయదుంధుబి మోగించారు. అఖండ విజయంతో కూటమి అధికారంలోకి రావడంతో ప్రభుత్వం జనసేన కీలక పాత్ర వహిస్తుంది. ఇక కొండగట్టు దర్శనం తరువాత పవన్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించనున్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. అదే రోజున వారాహి సభను ఏర్పాటు చేసిన తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సమస్యలను తెలుసుకోనున్నారు.