»Good News For The People Of Telangana Southwest Monsoon Has Entered The State
Weather Report: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
వర్షకాలం ప్రారంభం అయింది. సాధారణంగా జూన్ రెండో వారంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
Good news for the people of Telangana.. Southwest Monsoon has entered the state
Weather Report: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ప్రతీ సంవత్సరం జూన్ రెండవ వారంలో వచ్చే రుతుపవనాలు ఈ ఏడాది ఒక వారం ముందుగానే రాష్ట్రాన్ని తాకినట్లు పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయి. అత్యంత వేగంగా కదులుతున్నట్లు వెదర్ రిపోర్ట్ తెలిపింది. నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండలో ఈ నైరుతిరుతుపవనాలు ప్రవేశించాయి.
ఈ పరిణామంతో మాములు కంటే ఈ ఏడాది అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం వేడిగా ఉండడంతో పాతు గాలీలో తేమ శాతం కారణంగా సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే రేపటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎప్పుడూ తెలంగాణలోకి జూన్ రెండో వారంలో ఈ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం ముందే ప్రవేశించాయి.