»23 Year Old Indian Student Of California State University Missing In Us
missing : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని అదృశ్యం
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి ఒకరు అమెరికాలో కనిపించకుండా పోయారు. అక్కడి కాలిఫోర్నియా రాష్ట్రంలో చదువుకుంటున్నా ఆమె మే 28 నుంచి అదృశ్యమయ్యారు.
Hyderabad student missing : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళుతున్న విద్యార్థులు అమెరికాలో ఇబ్బందుల పాలు కావడం ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తున్నాం. ఏప్రిల్ నెలలో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన విద్యార్థి తొలుత కనిపించకుండా పోయి తర్వాత మృత దేహమై కనిపించాడు. ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు మరో హైదరాబాద్ విద్యార్థిని( student) అక్కడ అదృశ్యం అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హైదరాబాద్కు చెందిన నితీష అనే 23 ఏళ్ల అమ్మాయి కాలిఫోర్నియాలోని(California) లాస్ ఏంజలస్లో చదువుకుంటోంది.
అక్కడి శాన్ బెర్రార్డినోలోని స్టేట్ యూనివర్సిటీలో(State University) నితీష చదువుకుంటోంది. మే 28 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లాస్ ఏంజలస్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతి ఫోటో, సమాచారంతో పలు సోషల్ మీడియా ప్లాట్ఫాంల్లోనూ ప్రకటనలు చేశారు. ఆమె సమాచారం, ఆచూకీ తెలిస్తేవ ఎంటనే తమకు తెలియజేయాలని స్థానికుల్ని కోరారు.
పోలీసులు ఈ మేరకు ఓ రిటెన్ స్టేట్మెంట్ను అక్కడ జారీ చేశారు. ఆమె 2021 మోడల్ టొయోటా కొరొల్లాను, కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్తో కలిగి ఉందని తెలిపారు. ఆమె ఐదు అడుగుల ఆరు అంగుళాల పొడవు,,, 160 పౌండ్ల బరువుతో తెల్లగా ఉంటుందని వివరాలను పొందుపరిచారు. నల్లటి జుట్టు, నల్లటి కనుగుడ్లతో ఉంటుందని పేర్కొన్నారు.