ఢిల్లీ లిక్కర్ పాలీసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్ తగిలింది. వచ్చే నెల 3 వరకు తన కస్టడీని పొడిగిస్తూ తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లి బిగ్ షాక్ ఎదురైంది. తన కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల అంటే జులై 3 వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ముందుగా ఇచ్చిన కోర్టు ఆదేశాల ప్రకారం నిన్న ఆదివారంతో కవిత కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు కవితను కోర్టులో హాజరు పరిచారు. భారీ భద్రత నడుమ కవితను కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు అవరణంలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఆ సమయంలో కవిత జై తెలంగాణ, జై భారత్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇప్పటికే పలు మార్లు కవిత మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ పెట్టిన సంగతి తెలిసిందే. తన బెయిల్‌ను సవాల్ చేస్తే అటూ సీబీఐ, ఈడీ కౌంటర్లు దాఖలు చేశాయి. దీంతో తన ఆశలు నిరాశలు అయ్యాయి. మరో నెల రోజుల పాటు కస్టడీని పొడిగించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై కేసీఆర్, కేటీఆర్ ఎలా స్పందిస్తారో అని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#WATCH | BRS leader K Kavitha brought to Rouse Avenue Court in Delhi.
She is being produced here at the end of her Judicial Custody period in ED case related to Delhi Excise Case. pic.twitter.com/oG64XRTmQF