ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. హైకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతే తీర్పు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.
Arvind Kejriwal: Kejriwal's disappointment in the Supreme Court
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. హైకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతే తీర్పు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఆదేశాలు ఇచ్చి ముందస్తు తీర్పు ఇవ్వడం సరికాదని చెప్పింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడంతో దాన్ని సవాలు చేస్తూ.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం విచారించింది.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌధరీలు హాజరయ్యారు. ట్రయల్ కోర్టు ఆర్డర్ చూడకముందే హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు మీరు ఎందుకు హైకోర్టు ఆర్డరుపై స్టే విధించలేరని సుప్రీంకోర్టు కేజ్రీవాల్ తరఫున లాయర్ ప్రశ్నించారు. హైకోర్టు స్టే విధించడం ఊహించని విషయమని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. హైకోర్టు తప్పు చేస్తే ఆ తప్పును మేం మళ్లీ చేయాలా? అని ప్రశ్నించింది. ఒకరోజు వేచి చూడటం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై జూన్ 26న విచారణ చేపడతామని తెలిపింది.