అన్ని సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటున్నాయి.. మరి గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి? అని మెగా ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. అయితే.. లేటెస్ట్గా ఇప్పుడు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
Game Changer: ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నపాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈసినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన జరగండి సాంగ్ చార్ట్ బస్టర్గా నిలిచింది. అయితే.. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
ప్రస్తుతానికైతే చివరి దశకు చేరుకుంది. దీంతో.. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇంతకుముందు చిత్ర యూనిట్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా అక్టోబర్లో రానుందని తెలిసింది. అన్నట్టుగానే.. అక్టోబర్ ఎండింగ్లో గేమ్ చేంజర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారట. అయితే.. దేవర సినిమా దసరా నుంచి సెప్టెంబర్ 27 ప్రీపోన్ అవడంతో.. ప్రస్తుతం దసరా స్లాట్ ఖాళీగానే ఉంది.
అయినా కూడా దసరాకు గేమ్ చేంజర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. అందుకే.. దీపావళికి రావడం పక్కా అంటున్నారు. పోని మరి వెనక్కి వెళ్లి డిసెంబర్లో రిలీజ్ చేద్దామంటే.. ఇప్పటికే పుష్ప2 డిసెంబర్ 6కి వాయిదా పడింది. ఒకవేళ క్రిస్మస్కి ప్లాన్ చేసిన ఇప్పటికే రెండు మూడు సినిమాలు డేట్ లాక్ చేసుకున్నాయి. సో.. దాదాపు గేమ్ చేంజర్ మూవీ దీపావళికే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.