NTR: జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లింది దేవర చిత్ర యూనిట్. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. అక్కడ ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై అదిరిపోయే సాంగ్ షూట్ చేశారు. అయితే.. ఇప్పుడు ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది.
లేటెస్ట్గా ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ ల్యాండ్ అయ్యాడు. ఎన్టీఆర్ మరింత స్టైలిష్‌గా కనిపించాడు. అందుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే.. నెక్స్ట్ ఎన్టీఆర్, దేవర షూటింగ్లో పాల్గొంటాడా? లేదా వార్ 2 షూటింగ్లో జాయిన్ అవుతాడా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే వార్ 2కి సంబంధించిన కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు ఎన్టీఆర్. కానీ.. దేవర షూటింగ్ కొంతవరకు బ్యాలెన్స్ ఉండడంతో.. ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. దేవర షూటింగ్ ఇంకా కంప్లీట్ కానట్టుగా తెలుస్తోంది. దీంతో నెక్స్ట్ కూడా దేవర షూటింగ్‌తో బిజీ కానున్నాడు ఎన్టీఆర్. కాస్త గ్యాప్ తర్వాత కొత్త షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఇందులో క్లైమాక్స్‌కి సంబధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయనున్నారట. ఆ తర్వాత బ్యాలెన్స్ సాంగ్ ఘాట్‌ను ఫినిష్ చేస్తారట. మరి దేవర షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి.