MDCL: మల్లాపూర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రజలకు ఉచితంగా (FREE) రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. షుగర్, బీపీ, హిమోగ్లోబిన్, CBP, LPF, FP లాంటి వివిధ ప్రాథమిక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.