»Sensational Decision Of Telangana Government On Rythu Bandhu Notices To Farmers To Return
Rythu Bandhu: రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. తిరిగి ఇవ్వాలంటూ రైతకు నోటీసులు
అర్హత లేకున్నా రైతు బంధు తీసుకున్న వారి గుండెల్లో పిడిగుపడే వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయేత భూమిపై తీసుకున్న రైతుబంధు నిదులు వెనక్కి ఇవ్వాలని ఓ రైతుకు నోటీసులు పంపించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
Sensational decision of Telangana government on Rythu Bandhu.. Notices to farmers to return
Rythu Bandhu: అర్హత లేకున్నా రైతు బంధు తీసుకున్న వారి గుండెల్లో పిడిగుపడే వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయేత భూమిపై తీసుకున్న రైతుబంధు నిదులు వెనక్కి ఇవ్వాలని ఓ రైతుకు నోటీసులు పంపించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం రైతు యాదగిరిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. తాను వేసుకున్న వెంచర్లపై రైతుబంధు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దానిపై ఎంత తీసుకున్నాడో ఆ డబ్బును తిరగి చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. దానికి అతను రూ.16 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తుంది.
యాదగిరిరెడ్డి 33 ఎకరాల భూమిని ఫ్లాట్లుగా చేసి విక్రయించాడు. అది అగ్రికల్చర్ ల్యాండ్‌గా రిజస్టర్ కావడంతో అందరి రైతులకు పడినట్లే తనకు రైతు బంధు పడింది. అలా ఆ భూమిపై మొత్తం రూ.16 లక్షలు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో అతను తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో వ్యవసాయేతర భూములకు రైతుబంధు తీసుకున్న లబ్ధిదారులకు ఈ నోటీసులు పంపే ఆలోచనలో ఉంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.