Revanth Reddy: Farmer loan waiver based on passbook
Revanth Reddy: రుణమాఫీ విషయంలో రేషన్‌కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పాస్‌బుక్ ఆధారంగానే రూ.2లక్షల రుణమాఫీ ఉంటుందని తెలిపారు. కుటుంబాన్ని గుర్తించుందుకే రేషన్‌కార్డు నిబంధన పెట్టినట్లు తెలిపారు. ఈ నెల 18న రూ.లక్ష లోపు రుణాలు మాపీ చేయనున్నట్లు తెలిపారు. ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక రైతు కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్లరేషన్ కార్డు తప్పనిసరి. అన్ని షెడ్యూల్డు, వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ, జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబరు 12 నుంచి మంజురైన, రెన్యువలైన రుణాలకు, 2023 డిసెంబరు 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. రుణాల అసలు, దానికి వర్తించే వడ్డీని కలిపి రూ.2 లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.