హైదరాబాద్ హైటెక్ సిటీలో, ప్రఖ్యాతమైన స్ట్రీట్ ఫుడ్ ఇటరీస్లో ఒకటి అయిన కుమారి ఆంటీ స్టాల్, స్టాల్ ఓనర్ అయికుమారి ఆంటీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీని కలిసింది. తన ప్రత్యేక రుచులతో ఆకట్టుకుంటున్న కుమారి ఆంటీ, ప్రముఖుల సందర్శనలతో పాటు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మీమ్స్ వల్ల ప్రజల్లో ఆదరణ పొందింది.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీసీ కోహెనూర్ హోటల్ పక్కన ఉన్న స్టాళ్లను తొలగించే యోచనలో ఉన్నప్పుడు, కుమారి ఆంటీ హెడ్‌లైన్స్ లోకి వచ్చారు. ఈ విషయంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆమె స్టాల్‌ను తీయడానికి వీలు లేదని, తన వస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తాజాగా, కుమారి ఆంటీ తెలంగాణలో వచ్చిన వరద బాధితులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలో, ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 50 వేల రూపాయల చెక్‌ను అందించారు. ఈ చెక్‌ను ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు.
కుమారి ఆంటీ యొక్క ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. చిన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ తో జీవనం సాగిస్తున్న ఆమె, ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసిన ఒక సాధారణ మహిళగా మారింది. ఆమె కుటుంబానికి ఆర్థికంగా మద్దతు అందించడం, సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పం ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మొత్తానికి ఇంస్టాగ్రామ్ లో లక్షలు, కోట్లలో ఫాలోయర్స్ ఉన్నవాళ్ళకి కూడా రాణి గౌరవం, ఛాన్స్ కుమారి వచ్చింది.