Five days of heavy rains in Telangana..! A yellow alert has been issued for those districts
Yellow Alert: తెలంగాణలో రాష్ట్రంలో రానున్న ఐదురోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఇక గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలోతో పాటు నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి. అంతేకాదు ఈ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని హెచ్చిరించింది.
అలాగే శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.