»The Telangana Government Has Stopped The Distribution Of Textbooks This Is The Reason
Textbooks: పాఠ్యపుస్తకాల పంపిణీ నిలిపివేసిన తెలంగాణ ప్రభుత్వం.. కారణం ఇదే!
తెలంగాణ పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల విద్యార్థులకు పుస్తకాలు పంచారు. అందులో ముందు మాట మార్చలేదు. దీంతో వివాదస్పదం అయింది. ఇప్పుడు మళ్లీ పుస్తకాలు వెనక్కి ఇవ్వాలని విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది.
The Telangana government has stopped the distribution of textbooks.. This is the reason!
Textbooks: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ నిలిపివేయాలని విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం అయ్యాయి. దాంతో జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్‌లను పంపిణీ చేశారు. దీంతో పుస్తకాల్లో ప్రచురణకు సంబంధించి ఓ వివాదం తలెత్తింది. పుస్తకాల్లోని ముందుమాట మార్చుకుండా మునుపటి వివరాలతో విద్యాశాఖ పుస్తకాలను ముద్రించింది. అది కాస్త వివాదాస్పదం అయింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ వెంటనే పుస్తకాల పంపిణీని నిలిపియాలని, ఇచ్చిన పుస్తకాలను విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.