ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్, జింబాంబ్వే, సౌతాఫ్రికాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు 100 మందికి పైగా మృతిచెందారు. జింబాంబ్వేలో 70, సౌతాఫ్రికాలో 30 మంది మృతిచెందినట్లు సమాచారం. మొజాంబిక్‌లో 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. సహాయక బృందాలు హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నాయి. నేషనల్ పార్క్‌లో 600 మంది పర్యాటకులు చిక్కుకున్నారు.