టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. లేఖను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్కు పంపించగా ఆమోదించి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు.
TSPSC Chairman Resign: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గత ప్రభుత్వంలో ఉన్న వారంతా క్రమంగా పదవులకు రాజీనామా చేస్తున్నారు. నామినెటెడ్ పోస్టులను రేవంత్ ప్రభుత్వం రద్దు చేయగా.. మరికొందరు పదవీ కి రాజీనామా చేస్తున్నారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ (TSPSC Chairman) జనార్దన్ రెడ్డి (janardhan Reddy) పదవీకి రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్కు పంపించారు. తమిళి సై సౌందరరాజన్ రాజీనామాను ఆమోదించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. పరీక్ష పేపర్లు లీకవడంతో బోర్డుపై అపనమ్మకం ఏర్పడింది. తర్వాత పరీక్షలు వాయిదా పడటంతో నిరుద్యోగుల్లో ఆగ్రహాం పెల్లుబికింది. బోర్డుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.
బోర్డు చైర్మన్.. తర్వాత సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. పరీక్షలకు సంబంధించి మధ్యాహ్నాం సీఎం రేవంత్ సమీక్ష చేశారు. తర్వాత సీఎంతో జనార్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన పరీక్షలకు సంబంధించి రీ షెడ్యూల్ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్యూట్ మెంట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. పరీక్షల తేదీ మార్చి.. కొత్త పరీక్షల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.