KTR: దేశంలో ఇతర పార్టీల నుంచి వేరే పార్టీకి చేరడం వంటివి ప్రారంభించింది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయిస్తే వేటుపడేలా చేస్తామని కాంగ్రెస్ మేనిఫేస్టోలో చేర్చింది. కానీ ఆ పార్టీ చెప్పేదొకటి, చేసేదొకటని కేటీఆర్ విమర్శించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్.. ఇప్పుడు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకుందని విమర్శించారు. పార్టీ ఫిర్యాయింపులపై నిన్న రాహుల్‌గాంధీ ఎన్నో మాట్లాడారు.
గెలిచే వరకు ఒక మాట.. గెలిచిన తర్వాత ఇంకో మాట అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ రీతి.. నీతి ఇదేనా? అని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. రాహుల్‌కు నిబద్ధత ఉంటే ఈ అంశంపై మాట్లాడాలని, లేకుంటే ఆయన ఒక హిపోక్రాట్గా మిగిలిపోతారని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడమో, స్పీకర్‌తో అనర్హత వేటు వేయించడమో చేయాలని రాహుల్‌కు సవాల్ విసిరారు.