SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నవంబర్ 4వ తేదీన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అభివృద్ధి అధికారి కాసింబి శనివారం తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. వేడుకల్లో పాల్గొనేవారు నవంబర్ 1వ తేదీ వరకు కలెక్టర్ కార్యాలయంలో తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.