వరంగల్: తెలంగాణ ఎండోమెంట్ శాఖ నూతన డైరెక్టర్గా నియమితులైన హరీష్ ఐఏఎస్ శనివారం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎండోమెంట్ సంస్థ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు.