Nara Lokesh: నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. చిర్రావూరు, పాతూరు, గండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన బైక్ మెకానిక్లు, ఇసుక ముఠా కార్మికులతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. పాత ఇసుక విధానంతో నిర్మాణరంగానికి గత వైభవం తీసుకొస్తామన్నారు. బైక్మెకానిక్లకు అధునాతన వాహనాలపై శిక్షణ అందిస్తామన్నారు.
ఇది కూడా చూడండి: Mexico: భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి!
అసలు జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులే అని లోకేశ్ అన్నారు. పనులు లేక వందలాది మంది కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని లోకేశ్ అన్నారు. గతంలో కార్మిక బోర్డు ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కార్మిక బోర్డు నిధులు రూ.2500 కోట్లు పక్కదారి పట్టించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కార్మిక సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేయడంతో పాటు చంద్ర్రన్న బీమా పథకం, పనిముట్లు అందజేస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు.