ASR: ఆగస్టు నెల 3వ తేదీ వరకూ జరుగుతున్న మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ముంచంగిపుట్టు మండలంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్సై జే. రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. మారుమూల ప్రాంతాల నుండి ముంచంగిపుట్టు వచ్చే బైక్లు, ఆటోలు, జీపులు, కార్లు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.