AP: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 2,29,743 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,48,900 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. డ్యామ్ నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా కొనసాగుతోంది.