ప్రకాశం: త్రిపురాంతకం మండలం గణపవరం స్టార్ హోటల్ వద్ద మంగళవారం అర్ధరాత్రి 9 అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. స్థానికులు స్నేక్ రెస్క్యూవర్ మల్లికార్జునకు సమాచారం అందించగా, స్పందించిన ఆయన చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు. దీనిని అడవిలో విడిచిపెడతానని, ఎవరికైనా పాములు కనిపిస్తే వాటిని చంపకుండా తనకు సమాచారం అందించాలని కోరారు.