GNTR: తాడికొండ అడ్డరోడ్లో మంగళవారం రాత్రి పోలీసులు సాధారణ తనిఖీ సమయంలో అక్రమంగా సారాను విక్రయిస్తున్న వ్యక్తిని తాడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తుళ్లూరు మండల పెద్దపరిమి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద నుంచి 49 బాటిల్స్ ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.