KDP: ప్రజా సమస్యలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని MPDO దివిజా సంపతి అన్నారు. మంగళవారం కాజీపేటలోని ఎంపీడీవో సభా భవనంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల ప్రగతిపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం దృష్ట్యా ఎరువులకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖకు సూచించారు.