MDK: శివంపేట మండలం గోమారం గ్రామ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ గౌడ్‌ను సస్పెన్షన్ చేసినట్లు ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. 2024లో గోమారంలో జరిగిన ఉపాధి హామీ పథకంలో ఆవకతవకలకు పాల్పడినట్లు గ్రామస్తులు ప్రజా వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు తాత్కాలిక సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.