కోనసీమ: జిల్లాలో జీవనోపాధిగా సాగుతున్న కొబ్బరి పంటల ఉత్పత్తుల ద్వారా రైతులకు మేలు చేసేందుకు జిల్లాలో కొబ్బరి ఉత్పత్తి సంస్థలు నెలకొల్పాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి కోరారు. మంగళవారం నియమం 377 ప్రకారం పార్లమెంట్లో సభాపతిని కోరినట్లు ఆయన తెలిపారు. కోనసీమలో కొబ్బరి సాగు గ్రామీణ ప్రజలకు జీవనోపాధికి వెన్నెముక లాంటిదన్నారు.