MHBD:పెద్దవంగర మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా కుమ్మరి రాంమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడు పల్లపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం కొత్త కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా రాంమూర్తి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, అందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.