MHBD: సిరోలు, మరిపెడ మండలంలోని పోలీస్ స్టేషన్లను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నామినల్ రోల్, ప్రాపర్టీ రూమ్, స్టేషన్ పరిసరాలను పరిశీలించి, శుభ్రత, భద్రతపై సూచనలు చేశారు. ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్టేషన్ పరిసరాల్లో మొక్కలు నాటారు.