WGL: సంగెం మండలంలోని శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం నాగులపంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలసర్పదోష నివారణ, సంతాన ప్రాప్తికి భక్తులు పుట్టలో పాలు పోసి, వెండి నాగుపాములు సమర్పించారు. అర్చకుడు అప్పే నాగార్జునశర్మ మాట్లాడుతూ.. స్వామివారి అనుగ్రహంతో భక్తుల కోరికలు నెరవేరుతాయని తెలిపారు.