కృష్ణా: ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని స్త్రీశక్తి భవనంలో మంగళవారం ఇల్లు నిర్మాణ పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా హౌసింగ్ హెడ్ జీ.పోతురాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 501 లబ్దిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహం గురించి వివరించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.