GNTR: పొన్నూరు నియోజకవర్గంలో గతంలో జరిగిన బర్నబాసు హత్యకేసులో సీఐడీ తనకు నోటీసులు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కొట్టిపారేశారు. గుంటూరు కృష్ణనగర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రోశయ్య మాట్లాడారు. తన ఎదుగుదలని ఓర్వలేక కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.