ADB: నార్నూర్ మండల కేంద్రంలోని నడ్డంగూడ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మంగళవారం పర్యటించారు. గ్రామస్తులను కలిసి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు క్షయ వ్యాధిగ్రస్తులను కలిసి మందులను అందజేశారు. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడేవారు టీబీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. పూర్తి అవగాహనతోనే క్షయ వ్యాధిని నిర్మించవచ్చునని పేర్కొన్నారు.